Fri Apr 04 2025 15:28:45 GMT+0000 (Coordinated Universal Time)
స్విమ్మింగ్ పూల్ లో పడి చిన్నారి మృతి
స్విమ్మింగ్ పూల్ లో పడి బాలిక మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.

స్విమ్మింగ్ పూల్ లో పడి బాలిక మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్ఎసీఎల్ గ్రేటర్ కమ్యునిటీకి చెందిన నిఖిల్ కుమార్ కుమార్తె ఆద్య కు ఈత నేర్పేందుకు నిన్న స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లాడు. ఆద్య వయసు ఎనిమిదేళ్లు. ఈత నేర్చుకుంటుండగా తండ్రి నిఖిల్ కుమార్ తన డ్రెస్ ను మార్చుకునేందుకు రూములోకి వెళ్లారు.
తండ్రి ఉండగానే...
అయితే స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఆద్య మరణించింది. డ్రెస్ మార్చుకుని వచ్చిన నిఖిల్ కుమార్ ఆద్య కోసం వెదుకులాడగా స్విమ్మింగ్ పూల్ లో శవమై కనిపించింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దీంతో ఉగాది పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story