Sat Nov 16 2024 12:57:25 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇరవై ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు
హైదరాబాద్ లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇరవై ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ ఉదయం నుంచి తనిఖీలు ప్రారంభించారు.
రియల్ ఎస్టేట్ కంపెనీలపై...
రియల్ ఎస్టేట్ కంపెనీ గూగికి చెందిన ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్సుఖ్ నగర్ లోని ప్రధాన కార్యాలయంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఫార్మాహిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ వంటి పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈ సోదాలు తెల్లవారు జామునుంచే జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ప్రధాన కారణంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది.
Next Story