Thu Jan 16 2025 17:48:38 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్‌లో ఐటీ దాడుల కలకలం
హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే వంద బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నాయి
హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే అనేక బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రధాన కంపెనీలతో పాటు ఆ కంపెనీ యజమానులు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. దాదాపు వంద బృందాలే ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి.
వంద బృందాలు...
ఆదాయపు పన్ను శాఖ అధికారులతో వివిధ కంపెనీల యాజమాన్యం భయపడుతోంది. దాదాపు వంద బృందాలుగా విడిపోయి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేశారన్న కారణంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, రఘువీర్, వజ్రనాధ్ ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
Next Story