Mon Dec 23 2024 06:16:34 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. మంత్రి బంధువుల ఇళ్లలోనూ
హైదరాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
హైదరాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి బంధువులు, ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఫార్మా కంపెనీ ఛైర్మన్లు, సీఈవో, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పన్ను ఎగవేశారని...
పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేశారన్న కారణంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు పదిహేను ప్రాంతాల్లో ఇరవైకి పైగా బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆదాయపు పన్ను శాఖ కు రిటర్న్ సమర్పించిన దానికి వారి ఆదాయానికి పొంతన లేని కారణంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Next Story