Sun Nov 17 2024 08:37:25 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. ప్రముఖ బిల్డర్లు ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. ప్రముఖ బిల్డర్లు ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రముఖ బిల్డర్ వంశీరామ్ ఇంట్లోనూ, ఆయన కార్యాలయంోలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బంధువుల ఇళ్లలో...
వంశీరామ్ బంధువు జనార్థన్ రెడ్డి ఇళ్లలోనూ ఐటీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం పదిహేను చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను మొత్తాన్ని ఎగవేశారన్న ఆరోపణలపై ఈ సోదాలను ఐటీ శాఖ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Next Story