Sun Dec 22 2024 16:10:36 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఐటీ సోదాలు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను సోదాలు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను సోదాలు కలకలం రేపుతున్నాయి. ఒక కంపెనీకి సంబంధించి ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు రావడంతో ఈ సోదాలు నిర్వహించారు. షాద్ నగర, చేవెళ్ల, బంజారాహిల్స్ లో మొత్తం ఒకేసారి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఆరు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
భూమిని అమ్మిన....
అయితే ఒక కంపెనీ మూడు వందల ఎకరాల భూమిని మరొక మల్టీ నేషనల్ కంపెనీకి విక్రయించిన నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించలేదన్న కారణంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ భూమిని విక్రయిచిన కంపెనీ యజమాని ఇళ్లలోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story