Sun Dec 22 2024 16:26:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో ఐటీ సోదాలు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ముప్ఫయి చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ముప్ఫయి చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రియల్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడకు చెందిన...
. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. మరో వైపు విజయవాడకు చెందిన రియల్టర్లు బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అచ్యుతరావు, కొప్పన అనూప్ ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. అన్విత బిల్డర్స్ లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. రాయదుర్గం, కొల్లూరులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఎగవేశారన్న కారణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి.
Next Story