Mon Dec 23 2024 03:46:57 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఒక ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఒక ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నారు.
తొమ్మిది ప్రాంతాల్లో...
కోకాపేట్, రాయదుర్గం, మొయినాబాద్ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story