Mon Apr 07 2025 18:46:21 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
రాత్రికి రాజ్ భవన్ లోనే బస...
రాష్ట్రపతి ఈరోజు హైదరాబాద్ నగరంలో జరిగే ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రికి రాజ్ భవన్ లో బస చేయనున్నారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతర్జాతీయ జానపద కళారూపాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారని రాష్ట్రపతి వర్గాలు వెల్లడించాయి.
Next Story