Mon Dec 23 2024 04:50:37 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఎన్నికల కోడ్... రేసింగ్ లీగ్ రద్దు.. చెన్నైకు వేదిక మార్పు
హైదరాబాద్ లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దయింది. ఎన్నికల కోడ్ ఉండటంతో నిబంధనలు అంగీకరించడం లేదు
హైదరాబాద్ లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దయింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రేసింగ్ ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మామూలుగా అయితే ఈ నెల 4,5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ కు హైదరాబాద్ వేదిక కావాల్సి ఉంది. అందుకు ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేశారు. గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన రేసింగ్ కు హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు.
టిక్కెట్ల డబ్బులను...
హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు సగం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇక్కడ రేసింగ్ జరిపేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో రేసింగ్ ను చెన్నైకు నిర్వాహకులు తరలించారు. ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్లు విక్రయాలు జరిగాయి. అయితే రేసింగ్ రద్దు కావడంతో డబ్బులు తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా ఏర్పాట్లు చేసుకోవడమేంటని రేసింగ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Next Story