Mon Dec 23 2024 12:01:13 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో విమానంలో తెలుగు మహిళకు అవమానం.. కేటీఆర్ ట్వీట్
ఆమెకు ఇంగ్లీషు/హిందీ అర్థం కాకపోవడం భద్రతా సమస్య అని
ఇండిగో విమానంలో తెలుగు మహిళకు అవమానం జరిగింది. ఇంగ్లీష్/హిందీ రాదన్న కారణంతో ఓ తెలుగు మహిళను విమానంలో కూర్చున్న సీట్లోంచి తీసుకెళ్లి మరో చోట కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 16న విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విమానం బయలుదేరింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత కథనం ప్రకారం, ఇంగ్లీషు లేదా హిందీ అర్థం కాని ప్రయాణీకురాలిని ఎగ్జిట్ రో నుండి మరో చోటుకు మార్చబడ్డారు. ఎగ్జిట్ రో సీట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ల పక్కన ఉంచుతారు. ఆ సీట్స్ లో అదనపు లెగ్‌రూమ్ ఉంటుంది. దీనికి అదనపు ఛార్జీ ఉంటుంది. ఐఐటీ ప్రొఫెసర్ దేవస్మిత చక్రవర్తి ఈ ఘటనపై సెప్టెంబర్ 17న ఈ విషయంపై ట్వీట్ చేశారు.
"ఆమెకు ఇంగ్లీషు/హిందీ అర్థం కాకపోవడం భద్రతా సమస్య అని ఫ్లైట్ అటెండెంట్ చెప్పారు," అని చక్రవర్తి ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 16న ఇండిగో 6ఇ 7297లో ఓ తెలుగు మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. 2ఏ(ఎక్స్ఎల్ సీటు, ఎగ్జిట్ రో)లో ఆమె కూర్చోని ఉండగా.. ఆ మహిళకు హిందీ/ఇంగ్లీష్ రాదని తెలుసుకుని.. 3సీ సీట్లోకి మార్చేశారు విమాన సిబ్బంది. ఆమెతో మాట్లాడిన ఫ్లైట్ అటెండెంట్ భద్రతా పరమైన ఆందోళనగా పేర్కొంటూ ఆ మహిళ పట్ల విక్షక్ష ప్రదర్శించారు అని దేవస్మిత ట్విట్టర్లో ఫొటోను పోస్టు చేశారు. ఎగ్జిట్ రో ఫ్లైయర్లు అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సహాయం చేయడానికి సిబ్బందితో కమ్యూనికేట్ చేస్తారు. అలా కాకపోతే, వారిని వేరే చోటికి మార్చాలని సిబ్బంది నిర్ణయించుకోవచ్చని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు.ఎగ్జిట్ రో సీట్లను విక్రయించే ముందు అవసరమైన తనిఖీలను నిర్వహించడం ఎయిర్‌లైన్ బాధ్యత అని కొందరు సూచించారు.
తెలంగాణ మంత్రి కెటి రామారావు ఈ ఘటనపై స్పందించారు. స్థానిక భాష మాట్లాడేవారికీ గౌరవం ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేస్తూ.. ఇక నుంచైనా స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగిన ప్రయాణికులను కూడా గౌరవించాలని సూచించారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేని ప్రయాణికుల్ని కూడా గౌరవించాలని.. విమానాలు ప్రయాణించే రూట్ల ఆధారంగా ఆయా భాషలు మాట్లాడగలిగే సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.
Next Story