Tue Apr 01 2025 05:41:34 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా సర్కిల్ సమీపంలో

హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా సర్కిల్ సమీపంలో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. బట్టల దుకాణాలకు పేరుగాంచిన మదీనా-అబ్బాస్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షాపింగ్ కాంప్లెక్స్‌లోని నాల్గవ అంతస్తులో మంటలు మొదట అంటుకున్నాయి.. ఆ తర్వాత మూడో అంతస్తుకు వ్యాపించాయి. మంటల గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదంలో దాదాపు 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. కాంప్లెక్స్‌లో ఉన్న వస్త్ర దుకాణాలకు అపారమైన ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు, అయితే, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్లాస్టిక్ తయారీ కంపెనీలో ఆదివారం నాడు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు. మంటల గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నగరంలో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరిలో బాచుపల్లి నిజాంపేట ప్రాంతంలోని టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. రెస్టారెంట్ వద్ద పలువురు కార్మికులు ఉండగా ఈ ఘటన జరిగింది.
Next Story