శిల్ప కళా వేదికలో ఊహించని ప్రమాదం.. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కుమార్ అమ్మిరేశ్ మృతి
ఆయన పడిపోవడాన్ని పసిగట్టిన సిబ్బంది వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లారు. ఆయన్ను అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోయే సిరివెన్నెల సీతారామశాస్త్రి బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై నివేదిక ఇవ్వడం కోసం పలువురు అధికారులతో కలిసి ఇంటెలిజెన్స్ డీఎస్పీ కుమార్ అమ్మిరేశ్ కూడా వచ్చారు. ఆ సమయంలో ఆయన ఫోటోలు తీయడం కూడా మొదలుపెట్టారు. అలా ఆడిటోరియం ఫోటోలు తీస్తూ ఆయన ముందుకు కదిలారు.. అలా వెళుతున్న సమయంలో కింద చూసుకోలేదు. అక్కడ కాలు ఓ చిన్న గుంతలో కాలు పెట్టారు. అక్కడ కాస్త స్లిప్ అయిన ఆయన.. అక్కడి నుండి కింద ఉన్న మెట్ల దారిలోకి పడిపోయారు.
ఆయన పడిపోవడాన్ని పసిగట్టిన సిబ్బంది వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లారు. ఆయన్ను అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన డీఎస్పీని స్థానికంగా ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేశ్ స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని పాట్నా. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో జూబ్లీహిల్స్ ఐబీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.