Mon Dec 23 2024 09:53:12 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Liquor Scam: ఎవరీ శ్రీనివాసరావు? ఈడీ లోతుగా దర్యాప్తు
హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగితే డొంక కదులుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో జరిపిన సోదాల ఆధారంగా కరీంనగర్ జిల్లాకు చెందిన బిల్డర్ శ్రీనివాసరావును నిన్న ఈడీ అధికారులు విచారించారు. బిల్డర్ శ్రీనివాసరావు ద్వారాలనే ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
కీలక సమాచారం
శ్రీనివాసరావు, రామచంద్రపిళ్లై నుంచి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్ టెండర్ల కోసం ప్రత్యేకంగా విమాన టిక్కెట్లను కూడా శ్రీనివాసరావు బుక్ చేసినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ లోతుగా చేస్తున్న దర్యాప్తులో శ్రీనివాసరావుతో ఎవరెవరికి సంబంధాలున్నాయి? ఎవరి ద్వారా ముడుపులు ఎవరికి అందాయన్న దానిపై ఎక్కువ దృష్టి సారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం ఈ విచారణ చేస్తుంది.
Next Story