Tue Nov 19 2024 23:13:46 GMT+0000 (Coordinated Universal Time)
యాక్షన్ లోకి దిగిన ఐటీ కంపెనీలు.. 13 మందిపై వేటు
డ్రగ్స్ తీసుకుంటున్న 13 మంది ఉద్యోగులపై ఐటీ కంపెనీలు వేటు వేశాయి. ఇప్పటి వరకూ 13 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి.
డ్రగ్స్ తీసుకుంటున్న 13 మంది ఉద్యోగులపై ఐటీ కంపెనీలు వేటు వేశాయి. ఇప్పటి వరకూ 13 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. మరో యాబై మందికి నోటీసులు అందజేశారు. పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఉన్న చిరునామాల ఆధారంగా ఆ యా కంపెనీలకు పోలీసులు జాబితాను పంపాయి.
పెడ్లర్ల వద్ద నుంచి...
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తాము చేసుకునే పార్టీలలో డ్రగ్స్, గంజాయి అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహేంద్ర క్యూ సాఫ్ట్ కంపెనీలకు చెందిన ఉద్యగులు ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ్ కుమార్ , టోనీ, లక్ష్మీపతుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలింది.
Next Story