Sat Dec 21 2024 02:25:27 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా
ఐటీ కంపెనీలు ఉద్యోగల నియామక ప్రక్రియను చేపట్టాయి. ఈరోజు హైదరాబాద్ లో జాబ్ మేళాను వివిధ కంపెనీలు నిర్వహిస్తున్నాయి.
ఉద్యోగాల కోసం వేలాది మంది యువత ఎదురుచూస్తుంది. కరోనా నేపథ్యంలో ఉద్యోగాల నియామకాలు మందగించాయి. దీంతో యువత ఉపాధి కోసం ఇబ్బంది పడుతుంది. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగల నియామక ప్రక్రియను చేపట్టాయి. ఈరోజు హైదరాబాద్ లో జాబ్ మేళాను వివిధ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ సమీపంలోని ఖాజా మ్యాన్షన్ ఫంక్షన్ హాలులో ఈ జాబ్ మేళా జరగనుంది.
నేరుగా ఇంటర్వ్యూలు....
ఈ జాబ్ మేళాలో దాదాపు నలబై కంపెనీలు పాల్గొననున్నాయి. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న వారు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. నేరుగా ఇంటర్వ్యూలుకు తమ బయోడేటాతో హాజరు కావచ్చని పేర్కొన్నారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
Next Story