Thu Jan 02 2025 17:05:20 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం.. తడిసి ముద్దయిన నగరం
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరం మొత్తం తడిసి ముద్దయింది.
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరం మొత్తం తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపైకి నీళ్లు చేరాయి. రోడ్లన్నీ చెరువులుగా మారడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం...
హైదరాబాడ్ నగరంలో మేడ్చల్, మాదాపూర్, నిజాంపేట్, మూసాపేట, కేపీహెచ్బీ, లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మల్లంపేట్, దుండిగల్, గండి మైసమ్మ, కృష్ణాపూర్, కండ్లకోయ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. అనేక చోట్ల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఇక సామాన్య ప్రజలు భారీ వర్షం ఒక్కసారిగా కురియడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులు సయితం తమ వ్యాపారాలు మూసి వేయాల్సి వచ్చింది.
దీపావళి సామగ్రి...
ఈరోజు కూడా కొందరు దీపావళి పండగ చేసుకుంటుండటంతో టపాసుల దుకాణాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. దీపావళి సామగ్రిని కాపాడుకోలేక వ్యాపారులు అవస్థలు పడ్డారు. అయినా సరే చాలా మందికి భారీగా నష్టం సంభవించిందని వ్యాపారులు వాపోతున్నారు. ఐకియా సెంటర్ లో ట్రాఫిక్ స్థంభించి పోయింది. విధులను ముగించుకుని నుంచి వచ్చే వేళ భారీ వర్షం కురియడంతో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. చాలా మంది తమ వాహనాలను కార్యాలయాల్లోనే ఉంచి మెట్రో రైళ్లలో బయలుదేరారు. దీంతో మెట్రో రైళ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. నిల్చోవడానికి కూడా చోటు లేకుండా కిక్కిరిసిపోయింది.
Next Story