Mon Dec 23 2024 07:00:17 GMT+0000 (Coordinated Universal Time)
జబర్దస్త్ కమెడియన్ నవ సందీప్ అరెస్ట్
జబర్దస్త్ కమెడియన్ గానూ, సింగర్ గానూ పేరు తెచ్చుకున్న నవసందీప్
జబర్దస్త్ కమెడియన్ గానూ, సింగర్ గానూ పేరు తెచ్చుకున్న నవసందీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జబర్దస్త్ కమెడియన్ సింగర్ నవసందీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. నవ సందీప్ యువతని పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆమెను లైంగికంగా లోబరచుకున్నాడు. పలుమార్లు నవ సందీప్ ను ఆ యువతి వివాహం గురించి అడగగా.. నవ సందీప్ మొహం చాటేసాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించి తాజాగా అరెస్టు చేశారు.
నవ సందీప్‌కు 2018లో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ 28 ఏళ్ల యవతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ చాలా కాలం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెను సందీప్ హైదరాబాద్ రప్పించాడు. షేక్‌పేట్‌లోని అల్ హమారా కాలనీలోని ఓ హాస్టల్లో ఉంచాడు. నాలుగు సంవత్సరాలుగా ఆ అమ్మాయి ఆ హాస్టల్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇద్దరు శారీరంకంగా కూడా దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సందీప్ ఆ తర్వాత నువ్వంటే ఇష్టం లేదని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు గోల్కొండ పోలీసులను ఆశ్రయించింది. తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును మధురానగర్ పోలీసుస్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.
Next Story