Mon Dec 23 2024 08:42:44 GMT+0000 (Coordinated Universal Time)
Junior NTR : ఎన్టీఆర్ కు జూనియర్ నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈరోజు ఉదయం తెల్లవారు జామునే ఆయన తన సోదరుడు కల్యాణ్ రామ్ తో కలసి వచ్చి తన తాత ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఏడాది సీనియర్ ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పిస్తారు.
తెల్లవారు జామునే...
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడ పెద్దయెత్తున చేరుకున్నారు. అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం అక్కడ తన కోసం వేచి ఉన్న ఫ్యాన్స్ కు అభివాదాలు చేస్తూ వెళ్లిపోయారు.
Next Story