Mon Dec 23 2024 13:15:27 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ చెప్పేశారు
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు ఆయన నిర్వాహకులకు సమాచారం అందించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు ఆయన నిర్వాహకులకు సమాచారం అందించారు. ఈ రోజు హైదరాబాద్లో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని నందమూరి కుటుంబ సభ్యులందరికీ నిర్వాహకులు ఆహ్వాన పత్రాలను అందచేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, దగ్గుబాటి కుటుంబీకులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలను అంద చేశారు.
రాలేనంటూ...
అయితే జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం మాల్దీవుల్లో జరుపుకోవడం కోసం ప్లాన్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆయన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో తాను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రాలేనని చెప్పారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
Next Story