ఆత్మహత్యకు పాల్పడ్డ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి
ఆత్మహత్యకు పాల్పడ్డ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి
ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఉన్న బెడ్రూంలో ఉమా మహేశ్వరి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమె మృతికి కారణం ఆత్మహత్యగా తెలియడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి అందకి కంటే చిన్న. ఉమా మహేశ్వరి వయసు 52 సంవత్సరాలు. ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఎన్టీఆర్ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. బాలకృష్ణ, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకున్నారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. రామారావు, భార్య నందమూరి బసవతారకం దంపతులకు 12 మంది పిల్లలు (8 మంది కుమారులు మరియు నలుగురు కుమార్తెలు). వారిలో ఆఖరి కుమార్తె ఉమామహేశ్వరి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తూ ఉన్నారు.