Fri Dec 27 2024 01:35:54 GMT+0000 (Coordinated Universal Time)
కరాటే కళ్యాణి-శ్రీకాంత్ మధ్య ఏమి జరిగింది.. కొట్టుకునేదాకా వెళ్లడమేంటో..!
హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ బస్తీలోప్రముఖ సినీనటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవలో చెంపదెబ్బలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ బస్తీలోప్రముఖ సినీనటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవలో చెంపదెబ్బలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. శ్రీకాంత్ రెడ్డి ఆమెతో మాట్లాడుతూ ఉండగా.. మొదట చెంపదెబ్బ వేసింది కళ్యాణి.. ఆ తర్వాత పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా వచ్చి చెంప దెబ్బ కొట్టడంతో శ్రీకాంత్ రెడ్డి అతడిని, కళ్యాణిని కూడా కొట్టడం వైరల్ వీడియోలో చూడవచ్చు. ఈ గొడవలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ దాడిలో శ్రీకాంత్ రెడ్డికి గాయాలయ్యాయి.
కరాటే కళ్యాణితో పాటు.. తనని కొట్టిన వ్యక్తిపై దాడి చేశాడు ప్రాంక్ లు చేసే శ్రీకాంత్ రెడ్డి. ఈ గొడవలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత మళ్లీ లేచి శ్రీకాంత్ రెడ్డిని వెంబడించి గుడ్డలు కొట్టింది కరాటే కళ్యాణి. బూతులు తిడుతూ మరీ అతడిపై దాడికి పాల్పడింది. ఫ్రాంక్ వీడియోలు తీయడం ఇష్టం లేకపోతే వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అంతేతప్ప నన్ను కొట్టే హక్కు నీకు ఎక్కడిది అంటూ కరాటే కళ్యాణిని ప్రశ్నించాడు శ్రీకాంత్ రెడ్డి. తనతో వీడియో తీసుకోవడానికి డబ్బులు అడిగిందని, అవి ఇవ్వకపోవడంతోనే ఇలా చేసిందంటూ ఆరోపణలు చేశాడు శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తన పక్కలో పడుకోవాలని అడిగాడని.. తన బొడ్డుపై చేయి పెట్టాడని అందుకే చెంప పగలగొట్టానంటూ వివరణ ఇచ్చింది కరాటే కళ్యాణి.
ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని.. ఎక్కడెక్కడో చేతులు వేసి మహిళల్ని అగౌరవ పరుస్తున్నాడని ఆరోపించింది కరాటే కళ్యాణి. ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, మహిళల్ని రెచ్చగొట్టి తన కామ కోర్కికలను తీర్చుకుంటున్నాడని చెప్పింది కరాటే కళ్యాణి. శ్రీకాంత్ రెడ్డి మాత్రం.. తాను డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ఈ ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని, కరాటే కళ్యాణి బాబీ అంటూ వ్యాంప్ పాత్రలు చేస్తే తప్పులేదు.. నేను మాత్రం వీడియోలు చేస్తే కొడతారా? అంటూ కౌంటర్ ఇస్తున్నాడు. దాడి అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

Next Story