Thu Nov 07 2024 09:53:41 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ హైదరాబాద్లో ఉండగానే కవిత అరెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో ఉండగానే కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి పర్యటనలకు సంబంధించి పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్ గిరిలో నేడు రోడ్ షో నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ కు వచ్చి రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ రోడ్ షోకు సంబంధించి 2,500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
ఈడీ అధికారులతో వాగ్వాదం...
అయితే ఇదే సమయంలో బంజారాహిల్స్ లో కవిత నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన తర్వాత ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొనాల్సి ఉంటుందని కూడా వారు అధికారులను హెచ్చరించారు. అయితే కవితను అరెస్ట్ చేస్తున్నామని ఈడీ అధికారులు ప్రకటించడంతో బయట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కేటీఆర్, హరీశ్ రావు కోరారు. కవిత నివాసం నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక బందోబస్తు మధ్య శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లారు.
Next Story