Mon Dec 23 2024 15:33:26 GMT+0000 (Coordinated Universal Time)
గణేష్ విగ్రహానికి అంకురార్పణ
హైదరాబాద్ లో అతి ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి ఈరోజు అంకురార్పణ జరిగింది.
వినాయక చవితి దగ్గర పడుతుంది. హైదరాబాద్ లో అతి ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. యాభై అడుగుల విగ్రహాన్ని తయారు చేయాలని ఖైరతాబాద్ గణేష్ సమితి నిర్ణయించింది. పూర్తిగా మట్టితోనే ఈ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. అందుకు ఈరోజు కర్రలను చేర్చి పూజలు నిర్వహించారు.
హుస్సేన్ సాగర్ లోనే....
ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం పంచముఖ లక్ష్మీ వినాయక అవతారంలో కన్పించనుంది. ఈసారి కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తామని సమితి ముఖ్యులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకూడదని ఏ కోర్టు చెప్పలేదని, ఈ వదంతులను ప్రజలు నమ్మవద్దని సమితి నేతలు కోరుతున్నారు.
Next Story