Mon Dec 23 2024 02:03:42 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటలకే ఈ యాత్రను నిర్వాహకులు మొదలు పెట్టారు
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటలకే ఈ యాత్రను నిర్వాహకులు మొదలు పెట్టారు. పోలీసుల ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచే ఖైరాతాబాద్ గణేశ్ వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లను స్టార్ట్ చేశారు. భారీ క్రేన్ సాయంతో గణేశుడి విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చి అనంతరం ఉత్సవ సమితి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. 11 రోజుల పాటు పూజలందుకున్న మహాగణపతి నేడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు.
మధ్యాహ్నానికి నిమజ్జనం...
మధ్యాహ్నం 1.30 గంటల్లా నిమజ్జనం పూర్తి చేయాలని నిర్ణయించడంతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఉదయమే ప్రారంభమయింది. అయితే ఖైరతాబాద్ గణేశుడిని ఏర్పాటు చేసిన 70 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని నిమజ్జనం చేయడానికి భారీ క్రేన్లను వినియోగించనున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడిని చేరనున్నారు.
Next Story