Fri Nov 22 2024 12:33:59 GMT+0000 (Coordinated Universal Time)
కదిలిన ఖైరతాబాద్ గణేశుడు
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయింది. నిన్న రాత్రి నుంచే వినాయకుడి తరలింపునకు ఏర్పాట్లు చేశారు
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయింది. నిన్న రాత్రి నుంచే వినాయకుడి తరలింపునకు ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభమయింది. ఈసారి 63 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. క్రేన్ సాయంతో మండపం నుంచి ట్రాలీపైకి ఎక్కించారు. పదకొండు రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గణనాధుడు ట్యాంక్ బండ్కు బయలుదేరాడు. శోభాయాత్ర నిదానంగా సాగుతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం జరిగే అవకాశాలున్నాయి. క్రేన్ నెంబరు 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
నెమ్మదిగా సాగుతూ...
ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు వేల మంది భక్తులు తరలి వచ్చారు. శోభాయాత్రలో వేల సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. గణేశ్ నిమజ్జనం చూసేందుకు కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయితే సగం కార్యక్రమం పూర్తయినట్లే భావిస్తారు. బాలాపూర్ గణేశుడు బయలుదేరిన తర్వాత మిగిలిప విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరడం ఆనవాయితీగా వస్తుంది.
Next Story