Sun Dec 22 2024 23:57:13 GMT+0000 (Coordinated Universal Time)
Kishan Reddy : నేడు హైదరాబాద్ కు కిషన్ రెడ్డి
ద్ర మంత్రిగా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి తొలిసారి హైదరాబాద్ కు వస్తున్నారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ కు రానున్నారు. కేంద్ర మంత్రిగా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి తొలిసారి హైదరాబాద్ కు వస్తున్నారు. మోదీ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేయడం ఇది రెండోసారి. కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలిసారి హైదరాబాద్ కు వస్తుండటంతో ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలకనున్నారు.
భారీ స్వాగతం...
శంషాబాద్ విమానాశ్రయం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకూ ర్యాలీగా కిషన్ రెడ్డిని తీసుకువచ్చేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. కిషన్ రెడ్డి రెండోసారి బొగ్గుగనుల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టి హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ నగరమంతా అభినందనలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి.
Next Story