Mon Dec 23 2024 04:33:00 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : పేకప్ చేసుకుని వెళ్లిపోండి.. కొత్త కొత్వాల్ వార్నింగ్
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలను స్వీకరించారు
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ సప్లయ్ చేసే వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని డ్రగ్స్ ముఠా ప్యాకప్ చేసుకుని వెళ్లిపోండని, లేకుంటే ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. సినీ ఇండ్రస్ట్రీలో డ్రగ్స్ డిమాండ్ చాలా ఉందన్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్ ను వినియోగిస్తే సహించబోమని అన్నారు. సరఫరా చేసే వారిని ఉపేక్షించబోమని తెలిపారు.
త్వరలోనే సమావేశం...
సినీ పరిశ్రమ ముఖ్యులతో త్వరలోనే సమావేశం పెడతామని కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫ్లెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురయిందన్నారు. పోలీసు వ్యవస్థను గౌరవించే వారితోనే ఫ్లెండ్లీగా ఉంటామని చెప్పారు. డ్రగ్స్ ముఠాలను కూకటవేళ్లతో పెకిలిస్తామని చెప్పారు. ఎవరు విక్రయించినా.. సరఫరా చేసినా వారిని బొక్కలో తోస్తామని ఆయన హెచ్చరించారు.
ప్యాక్
Next Story