Mon Dec 23 2024 13:23:13 GMT+0000 (Coordinated Universal Time)
నేడు లాల్ దర్వాజా బోనాలు
లాల్ దర్వాజా బోనాలు నేడు జరగనున్నాయి. దీంతో నగరమంతా బోనాలతో సందడిగా మారింది.
లాల్ దర్వాజా బోనాలు నేడు జరగనున్నాయి. దీంతో నగరమంతా బోనాలతో సందడిగా మారింది. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాల్లో లాల్ దర్వాజ బోనాలది ప్రత్యేకం. ఆషాఢమాసంలో ప్రతి ఏటా జరిగే బోనాల ఉత్సవాలు నగర వాసులును ఆకట్టకుంటాయి. దీంతో నగరమంతా పల్లె వాతావరణం తలపిస్తోంది. లాల్ దర్వాజా బోనాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆలయాల ముస్తాబు...
ఆలయాన్ని ముస్తాబు చేశారు. నగరంలోని అన్ని ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎటవంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులు బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు తీర్చుకోనున్నారు. దీంతో నగరంలోని వైన్ షాపులకు కూడా ఎక్సైజ్ శాఖ సెలవు ప్రకటించింది. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేస్తారు. ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story