Fri Dec 20 2024 12:05:50 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్
హైదరాబాద్‌లో హోలీ సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు
హైదరాబాద్ లో వైన్స్ షాపులన్నీ రేపు బంద్ కానున్నాయి. హోలీ సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేపు సాయంత్రం నుంచి...
ఈ నెల 6వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి వైన్ షాపులన్నీ బంద్ అవుతాయి. తిరిగి ఎనిమిదో తేదీ ఉదయం వరకూ వైన్ షాపులు తెరుచుకోవు. వైన్ షాపులు రేపు సాయంత్రం నుంచి బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మందుబాబులు ముందుగానే మద్యం కొనుగోలు చేయడానికి వైన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు.
Next Story