Mon Dec 23 2024 13:12:19 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బోనాల సందడి.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్రంలో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.
తెలంగాణ రాష్ట్రంలో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం తెల్లవారు జామునుంచి లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్‌ల కోసం ప్రత్యేకంగా మరో క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఈ నెల 10వ తేదీ వరకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్బీఐ క్రాస్ రోడ్స్ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను ప్యాట్నీ క్రాస్ రోడ్ వద్ద ప్యారడైజ్, మినిస్టర్ రోడ్, క్లాక్ టవర్, సంగీత్ క్రాస్ రోడ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిల్కలగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్, కవాడిగూడ, మ్యారియట్ హోటల్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైజ్, సీటీఓ, ప్లాజా, ఎస్బీఐ క్రాస్ రోడ్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, ప్యాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ పూరా రోడ్లు, జంక్షన్ల వైపు వాహనదారులు రావొద్దని సూచించారు. టబాకో బజార్, హిట్ స్ట్రీట్ నుంచి మహంకాళి ఆలయం వైపు వెళ్లే రహదారుల్లో వాహనాల రాకపోకలను నిలివేయనున్నారు. ఇక బాటా క్రాస్ రోడ్డు నుంచి పాత రాంగోపాల్ పేట పీఎస్, సికింద్రాబాద్ వరకు సుబాష్ రోడ్డులో వాహనాలు వెళ్లకుండా మూసివేయనున్నారు. కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను రాణిగంజ్ క్రాస్ రోడ్ వద్ద మినిస్టర్ రోడ్-రసూల్‌పురా క్రాస్ రోడ్-PNT ఫ్లై ఓవర్-సీటీవో-ఎస్బీఐ క్రాస్ రోడ్డు-YMCA క్రాస్ రోడ్డు-సెంట్ జాన్స్ రోటరీ-సంగీత్-గోపాలపురం లేన్ వైపు మళ్లించనున్నారు. రైల్వే స్టేషన్ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్, గాంధీ హాస్పిటల్-ముషీరాబాద్ ఎక్స్ రోడ్-కవాడిగూడ-మారియట్ హోటల్-ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లించనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి తాడ్బన్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్, ప్యాట్నీ క్రాస్ రోడ్డు, ఎస్బీఐ క్రాస్ రోడ్డు వైపు మళ్లింపు చేపట్టనున్నారు. బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, త్రిముల్గేరి వైపు వచ్చే వాహనదారులను ఘస్మండి క్రాస్ రోడ్ వద్ద సజ్జన్ లాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హిట్ స్ట్రీట్, రాణిగంజ్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Next Story