Mon Dec 23 2024 13:15:45 GMT+0000 (Coordinated Universal Time)
Mayor Vijayalakshmi: ఆ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్ విజయలక్ష్మి
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మేయర్ విజయలక్ష్మి
సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తూ అసభ్యకర వీడియోలు పెడుతున్నారంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వీడియోలను ఎక్కడ పోస్ట్ చేశారనే వివరాలను పోలీసులకు మేయర్ అందించారు. అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
తన మీద చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తన ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఆ వీడియోలు, కంటెంట్‌కి సంబంధించిన లింక్‌లను అధికారులకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యపై విచారణ జరిపి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని, అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించాలని ఆమె పోలీసులను అభ్యర్థించారు. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే!! ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి టార్గెట్ అయ్యారు.
“The videos in question feature fake and vulgar videos which are derogatory in nature and severely demeaning my character. I believe the creator and distributor of these videos originated from an X handle called @nijamenayya1 and further spread through Instagram, Facebook and WhatsApp accounts,” అంటూ ట్వీట్ చేశారు విజయలక్ష్మి.
Next Story