Sun Dec 22 2024 23:54:52 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ పోలీసులపై అసదుద్దీన్ ఆసక్తికరమైన ట్వీట్
హైదరాబాద్ లో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకు వచ్చిన కొత్త నినాదంపై పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు
హైదరాబాద్ లో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకు వచ్చిన కొత్త నినాదంపై పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇటీవల పాతబస్తీలో వరస హత్యలు జరగుతుండటంతో ఆందోళన చెందిన పోలీసులు నో ఫ్రెండ్లీ పోలీస్.. లాఠీ ఛార్జి పోలీస్ అంటూ పాతబస్తీలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకటన చేశారు. దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ లో పోలీసు ప్రకటనను వ్యతిరేకించారు. మైకుల ద్వారా లాఠీ ఛార్జి పోలీస్ అని హెచ్చరించడంతో ఆయన స్పందిస్తూ ఇలా జూబ్లీహిల్స్ లో చేయగలరా? అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ లో చేయగలరా?
కేవలం పాతబస్తీలోనే ఎందుకు అన్న తరహాలో ఆయన ప్రశ్నించారు. ఇతర మెట్రో నగరాల తరహాలోనే ఇరానీ చాయ్ దుకాణాలను, కిళ్లీ షాపులను, వ్యాపారాలను అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ అనుమతించాలని కోరారు. నగరంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోలు చేయడానికి పోలీసులు ఈ రకమైన ప్రకటన చేశారని ఉన్నతాధికారులు తెలిపారు. నేరాల నియంత్రణ కోసమే పోలీసులు ఈ పనిచేశారంటున్నారు. అయితే అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ కు పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Next Story