Sat Dec 21 2024 04:45:05 GMT+0000 (Coordinated Universal Time)
INDvsAUS: టెన్షన్ పడకండి.. మెట్రో సేవలు వినియోగించుకోండి
నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే
నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే..! ఈ మ్యాచ్ ను చూడడానికి క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు అర్ధరాత్రి వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 10 గంటలు దాటనుంది. ఇళ్లకు వెళ్లేందుకు నగరంలో ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నారు. రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే విషయంపై కూడా దృష్టి సారించారు.
ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో ఉప్పల్, స్టేడియం, NGRI మెట్రో స్టేషన్లలో మాత్రమే మెట్రో స్టేషన్ ఎంట్రీ గేట్స్ తెరిచి ఉంటాయి. మిగతా అన్ని ఇతర స్టేషన్లలో దిగిపోయే ప్రయాణికుల కోసం ఎగ్జిట్ గేట్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. మ్యాచ్కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుండి ఎగ్జిట్ అయ్యే వారు ముందుగానే రిటర్న్ టికెట్స్ కూడా తీసుకుంటే బెటర్. లేదంటే ప్రయాణ సౌలభ్యం కోసం, క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్ కార్డ్లను ఉపయోగించుకోవాలని మెట్రో అధికారులు సూచించారు. చివరి రైలు సెప్టెంబర్ 26న.. మ్యాచ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి దాటాక రాత్రి 1 గంట వరకు అమీర్పేట్, జేబీఎస్ పరేడ్గ్రౌండ్స్ నుండి కనెక్టింగ్ రైళ్లు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు.
టీ–20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ఉప్పల్ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు 50 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు.
Next Story