Mon Dec 23 2024 07:40:47 GMT+0000 (Coordinated Universal Time)
Metro : నేడు మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరుగుతుండటంతో మెట్రో రైళ్ల వేళను పొడిగించారు
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలను పొడిగించారు. ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరుగుతుండటంతో మెట్రో రైళ్ల వేళను పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాత్రి పొద్దుపోయేంత వరకూ మ్యాచ్ జరగనుండటంతో ఎక్కువ మంది తమ ఇళ్లకు చేరుకోవడానికి సులువుగా మెట్రో రైళ్ల సమాయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాచ్ కోసమే...
మెట్రో రైళ్లను నేడు 12.15 గంటల వరకూ పొడిగించాయి. క్రికెట్ మ్యాచ్ ను చూసిన వారు ఉప్పల్ స్టేడియంకు దగ్గర లో ఉన్న ఎన్జీఆర్ ఐ స్టేషన్ నుమచి మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. అలాగే ఉప్పల్ మార్గంలో దిగి వెళ్లేందుకు మాత్రమే వీలుంటుందని మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. రాత్రి పన్నెండు గంటల వరకూ జరుగుతుంది.
Next Story