Mon Dec 23 2024 06:18:11 GMT+0000 (Coordinated Universal Time)
Owaisi : ఓటు వేసిన అసద్ ఫ్యామిలీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోనూ ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో ఎక్కువ చోట్ల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యువత కూడా ఈసారి పోలింగ్ లో పాల్గొంటుండటం విశేషం.
పాతబస్తీలో ప్రశాంతంగా...
పాతబస్తీలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించకపోవడంతో యువ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రారని అంచనాలకు భిన్నంగా ఈసారి పోలింగ్ జరుగుతుంది.
Next Story