Mon Dec 15 2025 00:16:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైడ్రా కూల్చివేతలపై అసద్ డిఫరెంట్ గా స్పందించారే?
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏంచేయబోతున్నారని ఆయన నిలదీశారు.
ప్రభుత్వకార్యాలయాలను...
నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా? అంటూ అసదుద్దీన్ సూటిగా ప్రశ్నించాారు. నెక్లెస్ రోడ్డు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఆయన అన్నారు. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్యాలయం కూడా నీటి కుంటలో నిర్మించిందేనని ఒవైసీ అన్నారు. మరి జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు.
Next Story

