Fri Nov 22 2024 17:34:17 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికకు నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జిని మంత్రులు ప్రారంభించారు
హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికకు నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జిని మంత్రులు ప్రారంభించారు. దీంతో పంజాగుట్ట శ్మశాన వాటికపై రెండో ఫ్లై ఓవర్ ప్రారంభమయింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీలు ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో నాగార్జున సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య తొలుగుతుందన్నారు.
ట్రాఫిక్ సమస్యకు....
ఈ వంతెన నిర్మాణంతో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం ఉండదు. పంజాగుట్టలోని శ్మశానవాటికలోని ఉక్కుదిమ్మలపై ఈ వంతెనను నిర్మించారు. శ్మశాన వాటికపై నుంచి చట్నీస్ హోటల్ వైపునకు వెళ్లేలా ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
Next Story