Mon Dec 23 2024 01:30:33 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగార్జున స్పందన ఇదే
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం పై ఆయన కొద్దిసేపటి క్రితం తన అభిప్రాయాన్ని తెలిపారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని నాగార్జున అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కేసు న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు.
నోటీసులు ఇవ్వకుండానే...
తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడంపై అభ్యంతరం తెలిపారు. కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తానే దగ్గరుండి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసేవాడినని తెలిపారు. ప్రయివేటు స్థలంలో ఈ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించలేదని, కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున తెలిపారు.
Next Story