Sun Jan 05 2025 09:59:19 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు విచారణ జరగనుంది.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. గత విచారణలో కౌంటర్ కి పోలీసులు సమయం కోరారు. ఇటీవల వర్చువల్ గా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ తో బయట ఉన్నారు.
జనవరి పదికి వాయిదా...
అల్లుఅర్జున్ 14 రోజుల రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్ నేడు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10 కి వాయిదా పడింది. జనవరి10వతేదీన అల్లు అర్జున్ రిమాండ్ పైన విచారణ జరగనుంది. కౌంటర్ పోలీసులు ఏం చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story