Mon Dec 23 2024 06:19:49 GMT+0000 (Coordinated Universal Time)
జర్నలిస్టులకు ఓయూలో శిక్షణ.. 9న సదస్సు...
తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై జాతీయ సదస్సు జరగనుంది.
తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై జాతీయ సదస్సు జరగనుంది. ఈ నెల 9వ తేదీన జరిగే ఈ సదస్సును యూఎస్ కానసులేట్ జనరల్ తో కలసి ఉస్మానియా జర్నలిజం విభాగం నిర్వహిస్తుంది. ఇప్పికే తెలుగు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సును 90 గంటల శిక్షణ కార్యక్రమంలో భాగంగా యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ ప్రారంభించి ప్రసంగించననున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
తప్పుడు సమాచారాన్ని...
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, డేటాలీడ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ సయ్యద్ నజాకత్, భూమ్ లైవ్ న్యూస్ దక్షిణాది ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ ప్రసంగించనున్నారు. ప్రధాన మీడియాతో పాటు, యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సదస్సులో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఇందులో యాభై శాతం మహిళా జర్నలిస్టులే ఉన్నారు. గూగుల్ గుర్తింపు పొందిన ఫ్యాక్ట్ చెక్ శిక్షకుల ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని తొలగించేందుకు ఉపయోగించే సాధనాలు, అభ్యాసాలపై ఇక్కడ శిక్షణ పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి యూఎస్ కాన్సులేట్ జనరల్ నిధులు సమకూరుస్తుందని, రవాణా, మౌలిక వసతులు తదితర అంశాలు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం ఏర్పాటు చేస్తుంది.
Next Story