Sun Dec 22 2024 21:47:21 GMT+0000 (Coordinated Universal Time)
ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు మరింత ఎక్కువగా!
హైదరాబాద్ లో ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలను మరింత పటిష్టం చేయబోతున్నారు
హైదరాబాద్ లో ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలను మరింత పటిష్టం చేయబోతున్నారు. వీకెండ్స్ వచ్చినా.. ఏవైనా అకేషన్స్ వచ్చినా చాలు మందు తాగేసి రోడ్ల మీదకు వచ్చే మందు బాబులకు ఇకపై పోలీసులు చుక్కలు చూపించబోతున్నారు. అక్కడక్కడ మాత్రమే గతంలో మనం బ్రీత్ ఎనలైజర్స్ తో పోలీసులు చేసే టెస్ట్ లను చూసుంటాం. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ టెస్ట్ ల సంఖ్య పెంచబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను డయాజియో కంపెనీ అందజేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీసులకు బ్రీత్ అనలైజర్ లను కంపెనీ ప్రతినిధులు అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్ లను అందజేసేందుకు డయా జియో కంపెనీ ముందుకు వచ్చిందని.. ఎన్జీవో సిఎస్ఆర్ ఈ పని వెనుక ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సామాజిక బాధ్యతగా కంపెనీ పోలీసులకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను ఇచ్చిందని ప్రశంసించారు. పోలీస్ సిబ్బంది మందు తాగి వాహనాలను నడిపే వారిని పట్టుకోవడంపై మరింత సమర్థవంతంగా పని చేస్తుందని.. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను కూడా నియంత్రించవచ్చని తెలిపారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలే కాక ఇతరుల ప్రాణాలు కూడా కాపాడినవారు అవుతారు. ఇలాంటి పరికరాల ద్వారా పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ భారీగా నివారించవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ విజన్ తో ముందుకు వెళుతున్నారని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని తెలిసినా అందుకు విరుద్ధంగా మత్తులో నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మత్తులో అతివేగం, అజాగ్రత్తతో వాహనం నడపడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. మద్యం తాగి వాహనాలను నడపరాదని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
Next Story