Fri Nov 22 2024 17:34:01 GMT+0000 (Coordinated Universal Time)
New Year Celebrations : మందు తాగి డ్రైవ్ చేశారో ఇక అంతే.. రోజంతా డ్రంక్ అండ్ డ్రైవ్
డిసెంబరు 31 రాత్రి హైదరాబాద్ పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. రాత్రి మొత్తం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తారు
డిసెంబరు 31వ తేదీ రాత్రి హైదరాబాద్ నగర పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. ఆరోజు రాత్రి మొత్తం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రకటించారు. పబ్లు, బార్ల వద్ద ఈ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సహజంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం సేవించి రోడ్డు మీదకు రావడం ఎప్పటి నుంచో ఉంది. అయితే రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ సారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
ఉల్లంఘిస్తే ఇక చర్యలే...
నిబంధనలు ఉల్లంఘించి వాహనాల నడిపిన వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. మందుబాబులు కొంత అదుపులో ఉండటం మంచిది. నయా సాల్ జోష్ లో పడి ప్రాణాలు కోల్పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాము యాక్సిడెంట్లు చేసి వేరే వాళ్ల ప్రాణాలు తీసే హక్కు లేదని పోలీసులు చెబుతున్నారు. ఈసారి అవుట్ డోర్ ఈవెంట్స్కు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నామని, ఎవరూ హద్దులు దాటి ప్రవర్తించవద్దని ముందుగానే హెచ్చరిస్తున్నారు.
పబ్లు ముందే పరీక్షలు...
డిపెంబరు 31వ తేదీ రాత్రి ఆదివారం రావడం, సోమవారం సెలవు దినంగా ప్రకటించడంతో మందుబాబులు ఎక్కువ సేపు పబ్ ల్లో గడిపి బయటకు వచ్చి ప్రాణాలు మీదకు తెచ్చుకునే అవకాశముందని భావించి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎంతటి వారైనా కొత్త సంవత్సరం అరెస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యువకులపైనే ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలను ఇంట్లోనే చేసుకుని న్యూ ఇయర్ ఎంజాయ్ చేస్తే మంచిదన్న సూచనలు చేస్తున్నారు. దీంతో పాటు ఫ్లై ఓవర్లు మూసివేస్తామని, అవుటర్ రింగ్ రోడ్డ కూడా ఆరోజు మూసివేయడం జరుగుతుందని, ఇదంతా కేవలం ప్రమాదాల నివారణ కోసమేనని పోలీసులు చెబుతున్నారు.
Next Story