Mon Dec 23 2024 10:31:40 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబులకు బ్యాడ్ న్యూస్
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వైన్స్ షాపులు సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో మూతపడనున్నాయి. కేవలం వైన్స్ షాపులు మాత్రమే మూతపడనున్నాయి. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు రోజుల పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు, బార్లను మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక నిమజ్జనం సమయంలో మద్యం తాగి రావద్దని కూడా అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 28, 29 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం జరగనుంది. చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్ బండ్‌కు తరలివస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ఆయా ప్రాంతాల మధ్య MMTS ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సెప్టెంబర్ 28 గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం, సెప్టెంబర్ 29 ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్- లింగంపల్లి, సికింద్రాబాద్- హైదరాబాద్, లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య మొత్తం 8 రైళ్లు ప్రత్యేక సేవలందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Next Story