Mon Dec 23 2024 10:17:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆల్ఫా.. హోటల్ లో ఇదేందయ్యా?
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్ మాంసాహార ముడి పదార్థాలను అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్ అంటే ఫేమస్. ఇక్కడ భోజనం చేసేందుకు అనేక మంది వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఆల్ఫా హోటల్ లో బిర్యానీ తిని, చాయ్ తాగాలని భావిస్తారు.
నాసిరకం పదార్థాలతో...
అలాంటి ఆల్ఫా హోటల్ లో నాణ్యత లేని ఆహారాన్ని అందించడంపై అధికారులు మండిపడుతున్నారు. లక్ష రూపాయల మేరకు జరిమానా విధించారు. గతంలోనూ ఆల్ఫా హోటల్ పై దాడులు చేసినా వాళ్ల తీరు మారలేదని అధికారులు చెబుతున్నారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్ పై అధికారులు కేసు నమోదు చేశారు.
Next Story