Sun Dec 22 2024 18:39:56 GMT+0000 (Coordinated Universal Time)
Old City: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది
హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశనగర్‌లోని సోఫా తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మూడుంతస్తుల బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా తయారీ గోదాం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అంటుకున్న మంటలు ఫస్ట్ ఫ్లోర్‌కు సైతం క్షణాల్లో వ్యాపించాయి. స్థానికులు అక్కడకు చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (40), నాగరాణి (35), హరిణి (6), శివప్రియ (10) కి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్, తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సోఫా తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. గోదాం ఉన్న ఇంటిలోనే ఒక గదిలో నివసిస్తున్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.
Next Story