Sun Dec 22 2024 22:35:17 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య ఆదేశాలు.. జూనియర్ ఎన్టీఆర్‌కు అవమానం
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు వీధికెక్కాయి.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు వీధికెక్కాయి. ఈరోజు తెల్లవారు జామునే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కల్యాణ్‌రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి బాలకృష్ణ ఒకింత అసహనానికి గురయ్యారు. తన మనుషులకు వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆ మనిషి ఇప్పుడేనా? అంటే ఇప్పుడే తొలగించమని బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ఘాట్ లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగింాచారు.
ఫ్లెక్సీలను తొలగించి...
అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు చెందిన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ అక్కడి సిబ్బందిని నిలదీశారు. ఎవరో చెప్పినంత మాత్రాన వాటిని తొలగించడమేంటని వారు ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని తెలిసి ఆయన అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో నందమూరి హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కూడా ఉన్నాయి. అయినా వాటిని నిర్దాక్షిణ్యంగా బాలకృష్ణ తొలగించమని ఆదేశించడంతో కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెడుతున్నారన్న కామెంట్స్ బాగానే వినపడుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయి.
Next Story