Sun Jan 12 2025 13:46:38 GMT+0000 (Coordinated Universal Time)
దానం ఇలాంటి కామెంట్స్ మరోసారి చేసి?
మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందన్నారు.
మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందన్నారు. ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. కానీ అవినీతి జరగ లేదని తాను చెప్పలేదని దానం నాగేందర్ అన్నారు. తానేమీ కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్‌పై కేటీఆర్ తన సలహా తీసుకున్నారని తెలిపారు. తన అభిప్రాయం మాత్రమే అప్పుడు చెప్పానని అన్నారు. తాను ఫైటర్‌ను ఉప ఎన్నిక వచ్చినా భయపడనని అన్నారు.
హైడ్రాపై కూడా...
హైడ్రాపై కూడా తన వ్యాఖ్యల్లో మార్పు ఉండబోదని దానం అన్నారు. హైడ్రాపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. మూసీ ప్రక్షాళన అంశంపై బీజేపీ నేతలు ఒక్క రోజు నిద్ర చేశారని, మూసీ నిద్రకు ముందే ఏసీలు పెట్టించుకుని వెళ్లారని తెలిపారు. నిర్వాసితుల ఇళ్లలో కాకుండా బయట నుంచి తెచ్చిన టిఫిన్ కిషన్‌రెడ్డి తిన్నారని తెలిపారు. కంటితుడుపుగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేశారని దానం నాగేందర్ అన్నారు.
Next Story