Thu Dec 26 2024 01:41:33 GMT+0000 (Coordinated Universal Time)
Formula e: రేసింగ్ రద్దవడంపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారో తెలుసా?
హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
Formula e: హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రేసును రద్దు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రేసు రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, నిర్ణయమని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్ లు హైదరాబాద్ తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయని.. ఇండియాకు ఈ-ప్రిక్స్ ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు.
కార్ రేస్ వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదని.. మాజీ మంత్రి కేటీఆర్ ఈ రేస్ ల వల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పడం తెలివి తక్కువ తనమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. ఫార్ములా రేస్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతీస్తుందని నిరంజన్ చెప్పారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. రేస్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ట్రాఫిక్ ను స్తంభీంప చేసి గత ప్రభుత్వం అవివేక నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందుల్లో పడి.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో జరగాల్సిన ఈ-రేస్ సీజన్ 10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా.. అయితే ఫార్ములా వన్ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని నిర్వాహకులు తెలిపారు.
Next Story