కాలుష్యంపై పోరాట ర్యాలీలతో దద్దర్రిల్లిన బాచుపల్లి
పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో హైదరాబాద్ లోని బొల్లారం కాజిపల్లి బొంతపల్లి పాస మైలారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో హైదరాబాద్ లోని బొల్లారం కాజిపల్లి బొంతపల్లి పాస మైలారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంత కాలంగా వారు కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ప్రాతంలోని పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి రసాయనిక పరిశ్రమల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదజల్లుతున్నట్లు అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం వల్ల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు దుండిగల్ మున్సిపాలిటీ బొల్లారం మున్సిపాలిటీ లలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు రోజురోజుకీ తమ ఆరోగ్యాలు క్షీణిస్తున్నందున కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది మార్చి 9వ తేదీనన ర్యాలీలు నిర్వహించారు. తర్వాత మార్చి 15వ తారీఖున పీసీబీ అధికారులకు ప్రజల సంతకాలతో వినతి పత్రం సమర్పించారు. దానికి పిసిబి అధికారులు ఇచ్చినటువంటి ఈ క్రింది వాగ్దానాలను నెరవేర్చటంలో విఫలమైనందున దానికి నిరసనగా ఈరోజు బాచుపల్లి మల్లంపేట్ బొల్లారం కూడలిలో నిరసన తెలియజేశారు. రెండు నెలలు కావస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

